తిరుపతి: తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందించేందుకు ఎల్లవేళలా కృషిచేసే ఛానల్ జీ తెలుగు. నటీనటుల ప్రతిభను ప్రోత్సహించేందుకు 2023 సంవత్సరానికి గానూ ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ తారలు, బుల్లితెర నటీనటుల మధ్య అంగరంగ వైభవంగా జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ ఉత్సవాన్ని నిర్వహించిందని ఆ ఛానెల్ ప్రతినిధి చెప్పారు. మహిళల ప్రాధాన్యత ఇనుమడించేలా ప్రత్యేకమైన పింక్ కార్పెట్, జీ తెలుగు కుటుంబం అవార్డుల ప్రధానోత్సవం పార్ట్- 1 ప్రేక్షకులను అలరించిందని, ఇక, ఈ మెగా ఈవెంట్ పార్ట్-2ను ఈ ఆదివారం ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమైందన్నారు. ఆకట్టుకునే ప్రదర్శనలు, హృదయాన్ని తాకే క్షణాలు, మరపురాని
అనుభవాలతో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ గ్రాండ్ ఎంట్రీతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ యాంకర్స్ అయిన ప్రదీప్ మాచిరాజు-రష్మీ గౌతమ్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారన్నారు. ఈ నెల 5 ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు లో ప్రసారం అవుతుందని చెప్పారు.