Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

అదిరిపోయిన జగ్గుభాయ్‌ లుక్‌

హైదరాబాద్‌ : పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ వరుస పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటిలో మోస్ట్‌ అవైటెడ్‌ మూవీగా రూపొందుతున్న భారీ యాక్షన్‌ డ్రామా ‘సలార్‌’. తాజాగా ఈ మూవీ నుంచి ఓ స్పెషల్‌ అప్‌డేట్‌ ఇచ్చింది చిత్రబృందం. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన పాత్రలు పోషిస్తున్న జగపతి బాబు ‘సలార్‌’లో కూడా ఓ మెస్మరైజింగ్‌ రోల్‌ చేస్తున్నారు. ఇందులో ఆయన ‘రాజ మనార్‌’ పాత్రలో నటిస్తుండగా, మేకర్స్‌ తాజాగా లుక్‌ని విడుదల చేశారు. హంబులే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఈ సిని మాను విజయ్‌ కిరంగదూర్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రశాంత్‌ నీల్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఇందులో శృతిహాసన్‌ ప్రభాస్‌కి జంటగా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ‘సలార్‌’ను 2022 ఏప్రిల్‌లో భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img