Monday, February 6, 2023
Monday, February 6, 2023

అదిరిపోయే సన్నివేశాలతో మొదలైన చిరు 153

హైదరాబాద్‌ : మెగాస్టార్‌ చిరంజీవి 153వ ‘గాడ్‌ ఫాదర్‌’ తాజా షెడ్యూల్‌ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. ‘లూసిఫర్‌’ కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి మోహన్‌ రాజా దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి బర్త్‌ డే సందర్భంగా విడుదల చేసిన టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌కు అద్భుతమైన ఆదరణ వచ్చిన సంగతి తెలిసిందే! ఇందులో చిరంజీవి పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు మార్పులు చేశారు దర్శకుడు మోహన్‌రాజా. గత షెడ్యూల్‌లో చిరంజీవిపై అదిరిపోయే పోరాట సన్నివేశాలను తెరకెక్కించారు. తాజా షెడ్యూల్‌లో చిరంజీవి, ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. నీరవ్‌ షా కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ స్వరకర్త. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img