Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

అనసూయ మరో స్పెషల్‌ ‘ఐటమ్‌’

హైదరాబాద్‌ : బుల్లితెర క్రేజీ యాంకర్‌ కమ్‌ నటి అనసూయ మరోసారి స్పెషల్‌ నంబర్‌తో అలరించబోతోందని వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మాస్‌ మహా రాజా రవితేజ, త్రినాధ్‌ రావ్‌ నక్కిన దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కబోతోంది. కంప్లీట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో ఒక స్పెషల్‌ సాంగ్‌ ఉందట. ఈసాంగ్‌లో అనసూయ మాస్‌ మహారాజాతో కలిసి స్టెప్పులేయబోతోందని తెలుస్తోంది. అయితే, మేకర్స్‌ నుంచి ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాగా అనసూయ ఇప్పటికే కొన్ని సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం రవితేజ.. రమేశ్‌ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’, శరత్‌ మండవ దర్శకత్వంలో ‘రామారావు’ సినిమాలు చేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img