Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

ఆదికేశవగా వైష్ణవ్‌ తేజ్‌

హైదరాబాద్‌: పంజా వైష్ణవ్‌ తేజ్‌ కథా నాయకుడిగా, శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమాకు ఆదికేవగా టైటిల్‌ను ఫైనల్‌ చేశారు. చేస్తున్నాడని తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ వీడియో విడుదల చేశారు. గ్లింప్స్‌ వీడియోలో అంతా తవ్వేశారు.. మా గుడి జోలికి మాత్రం రాకండయ్యా.. శివుడికి కోపమొస్తే ఊరికి మంచిది కాదని విధ్వం సం సృష్టించేందుకు వచ్చిన రౌడీలతో పూజారి అంటున్నాడు. వైష్ణవ్‌ తేజ్‌ ఆ రౌడీల అంతు చూసే యాక్షన్‌ సన్నివేశాలతో గ్లింప్స్‌ వీడియో సాగుతుంది. వైష్ణవ్‌ తేజ్‌ ఈ చిత్రంలో పక్కా యాక్షన్‌ మాస్‌ అవతార్‌లో అదరగొట్టబోతున్నట్టు గ్లింప్స్‌ వీడియోతో అర్థమవుతోంది. ఈ మూవీలో శ్రీలీల, అపర్ణా దాస్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. కోలీవుడ్‌ యాక్టర్‌ కమ్‌ టాలెంటెడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాశ్‌ కుమార్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img