Wednesday, March 29, 2023
Wednesday, March 29, 2023

ఆర్‌ఆర్‌ఆర్‌ పాటకు ఆస్కార్‌ రావడం గర్వకారణం

తిరుపతి: ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా గురించి ప్రపంచమంతా చర్చించుకుంటోందని ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ అన్ని హంగులు ఉన్న సినిమా అని ప్రశంసించారు. అటువంటి సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ అవార్డు రావడం భారతీయ చలనచిత్ర రంగానికి గర్వకారణమని పేర్కొన్నారు. ‘కబ్జా’ చిత్ర దర్శకుడు చంద్రుతో కలిసి గురువారం ఆయన తిరుమల లోని వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో నటించిన వారంతా అద్భుత నటనను ప్రదర్శించారని, సాంకేతిక పరంగా సినిమాను ఉన్నత స్థాయిలో రూపొందించారని అన్నారు. తాను నటించిన ‘కబ్జా’ చిత్రం విడుదల సందర్భంగా ఆశీర్వాదం కోసం శ్రీవారిని దర్శించుకున్నానని చెప్పారు. కబ్జా చిత్రం విజయవంతం కావాలని స్వామివారిని కోరుకున్నానని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img