Tuesday, September 27, 2022
Tuesday, September 27, 2022

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల మళ్లీ వాయిదా !

హైదరాబాద్‌ : అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కీలక పాత్రల్లో నటిస్టున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం విడుదల తేదీ మరోసారి వాయిదా పడిరది. పోస్డ్‌ ప్రొడక్షన్‌ పనులు దాదాపుగా పూర్తయినట్లు ప్రకటించిన చిత్ర యూనిట్‌.. త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని వెల్లడిరచింది. ‘అక్టోబర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదల చేసేందుకు పోస్ట్‌ ప్రొడక్షన్‌ చాలా వరకూ పూర్తయ్యింది. కానీ, అందరూ అనుకున్నట్లే విడుదలను వాయిదా వేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లు ఇంకా పూర్తిగా తెరుచుకోని నేపథ్యంలో కొత్త విడుదల తేదీని ప్రకటించలేకపోతున్నాం. థియేటర్లు పునఃప్రారంభమైన వెంటనే తప్పకుండా సినిమా విడుదల చేస్తాం’ చిత్ర యూనిట్‌ వివరిం చింది. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్మిస్తు న్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న సంగతి విదితమే. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’, ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ టీజర్లు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్న సంగతి విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img