Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

ఆస్కార్‌ ‘రెడ్‌ కార్పెట్‌’పై ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందం

హైదరాబాద్‌: సినీ ప్రపంచంలో అత్యున్నత పురస్కారం ఆస్కార్‌… జీవితంలో ఒక్కసారైనా ఈ పురస్కారాన్ని అందుకోవడం ద్వారా తమతో పాటు తమ దేశానికి పేరు తేవాలని నటీనటులు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులు కలలు కంటారనడం అతిశయోక్తి కాదు. కాగా 95వ ఆస్కార్‌ వేడుకలు మార్చి 12న (భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం) వేడుక అట్టహాసంగా జరగనుంది. అయితే ఈసారి ఆస్కార్‌ రెడ్‌కార్పెట్‌పై ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందం సందడి చేయనుంది. రెడ్‌ కార్పె ట్‌పై నటీనటులు నడుస్తున్నప్పుడు ప్రాంగణం హర్షధ్వానాలతో మార్మో గిపోతుంది. ఫొటో గ్రాఫర్లు సెకన్లలో కొన్ని వందల చిత్రాలు క్లిక్‌ మనిపిస్తారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నిర్మించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు పాట ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకుంది. మన దేశంతోపాటు విదే శాల్లోనూ ఈ పాటకు అనేక మంది అభిమా నులు ఉన్నారు. ఎందరో సెలెబ్రిటీలు ఈ పాటకు చిందులేసి వీడియోలు పోస్ట్‌ చేశారు. ఇటీవలే ఈ పాట ఆస్కార్‌ నామినేషన్‌ కూడా దక్కించుకుంది. ఈ పాటకు ఆస్కార్‌ అవార్డు రావాలని ఎంతోమంది కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img