Tuesday, August 16, 2022
Tuesday, August 16, 2022

ఈమె ఎంట్రీ కన్ఫర్మ్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 సందడి మొదలు అయ్యింది. ఇటీవలే సీజన్ 5 కు సంబంధించిన లోగోను విడుదల చేయడంతో అతి త్వరలోనే సీజన్ ను మొదలు పెట్టబోతున్నట్లుగా స్టార్ మా హింట్ ఇచ్చింది. ఒక వైపు కరోనా థర్డ్ వేవ్ మరో వైపు ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో ఉండటం వల్ల అసలు ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా బిగ్ బాస్ సీజన్ 5 ప్రకటన వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 5 కు నాగార్జున హోస్ట్ చేస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం సీజన్ కు సంబంధించిన ప్రోమోల చిత్రీకరణ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్.సెట్టింగ్ ను కూడా ఇప్పటికే పునః నిర్మించే పనిలో ఉన్నారు. ఈసారి కొత్తగా సెట్టింగ్ ఉండబోతుంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈసీజన్ లో కంటెస్టెంట్స్ గా ముద్దుగుమ్మలను ఎక్కువగా మనం చూడబోతున్నామని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం బుల్లి తెర వెండి తెర తో పాటు సోషల్ మీడియా స్టార్స్ తో ఒక జాబితా తయారు అయ్యింది. అందులో నుండి కొద్ది మందిని తొలగించి వారం పది రోజుల్లో తుది జాబిత ఖరారు చేస్తారట. ఇప్పటి వరకు రెడీ అయిన జాబితాలో జాంబీ రెడ్డి లో నటించిన లహరి శారి పేరు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. బుల్లి తెరపై ఈమె ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సినిమాల్లో బిజీ అవ్వాలని ఆశ పడుతుందట. జాంబి రెడ్డిలో ఈమె పాత్ర కనిపించింది కొద్ది సమయం అయినా కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది. కనుక బిగ్ బాస్ లో ఈమె ఖచ్చితంగా ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 లో ఎలా అయితే లవ్ స్టోరీలను నడిపించారో అలాగే ఈ సీజన్ లో కూడా లవ్ స్టోరీలను స్క్రిప్ట్ తో నడిపిస్తారని అంటున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు సినిమా నుండి పోటీ ఉంది. కనుక ఖచ్చితంగా ఈ సీజన్ ను భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నారు. ఇంకా పలువురు ముద్దుగుమ్మలను ఈసారి బిబి హౌస్ లో చూడబోతున్నాం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img