Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

ఉగ్రం కోసం రోజుకు 18 గంటలు పనిచేశాం : అల్లరి నరేశ్‌

హైదరాబాద్‌: కామెడీ సినిమాలతో అలరించడమే కాకుండా మెసేజ్‌ ఓరియెంటెడ్‌ ప్రాజెక్టుల్లో కూడా నటిస్తుంటాడు అల్లరి నరేశ్‌. ఈ టాలెంటెడ్‌ యాక్టర్‌ కాంపౌండ్‌ నుంచి వస్తున్న తాజా చిత్రం ఉగ్రం. నాంది ఫేం విజయ్‌ కనకమేడల డైరెక్ట్‌ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఉగ్రం టీజర్‌, పాటలకు మంచి స్పందన వస్తోంది. ఉగ్రం మే 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ‘ఉగ్రం నా 60వ సినిమా. అల్లరి నుంచి ఇప్పటివరకు నా డైరెక్టర్లలందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాంది సినిమా విషయంలో మాకు ఎక్కువ అంచనాలేమి లేవు. మమ్మల్ని మేం నిరూపించుకోవాలి. ఉగ్రం విషయానికొస్తే అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలు అందుకునేందుకు చాలా కష్టపడ్డాం. సాహు-హరీష్‌ బడ్జెట్‌ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. మేమంతా ఉగ్రం సినిమా కోసం రోజుకు 16-18 గంటలు పనిచేశాం. నేనింతకు ముందు ఎమోషన్స్‌తో కూడిన ఫైట్స్‌ చేయలేదు. ఆ ఇంటెన్సిటీని మొదటిసారి చూస్తారు. మిర్ణా మీనన్‌కు మంచి భవిష్యత్‌ ఉంటుందని’ చెప్పుకొచ్చాడు అల్లరి నరేశ్‌. డైరెక్టర్‌ విజయ్‌ కనకమేడల మాట్లాడుతూ.. ఈ సినిమాను 73 రోజుల్లో షూట్‌ చేయగా.. వీటిలో 53 రోజులు రాత్రుల్లోనే షూట్‌ చేశామన్నాడు. బడ్జెట్‌ పెరిగినా నిర్మాతలు తనను చాలా సపోర్ట్‌ చేశారని చెప్పాడు. అల్లరి నరేశ్‌ తనపై పూర్తి నమ్మకం పెట్టుకున్నారని, యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం చాలా కష్టపడ్డాడని చెప్పుకొచ్చాడు. ఉగ్రం చిత్రానికి టూమ్‌ వెంకట్‌, అబ్బూరి రవి స్టోరీ, డైలాగ్స్‌ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది తెరకెక్కిస్తుండగా.. శ్రీచరణ్‌ పాకాల బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img