Sunday, April 2, 2023
Sunday, April 2, 2023

‘ఉగ్రం’ టీజర్‌ విడుదల

హైదరాబాద్‌: అల్లరి నరేశ్‌ నటించిన ఉగ్రం సినిమా టీజర్‌ బుధవారం విడుదలైంది. కామెడీ, సీరియస్‌ స్టోరీలతో ఇప్పటివరకు అభిమానులను పలకరించిన అల్లరి నరేశ్‌… ఈ సారి మాత్రం కాస్త రూటు మార్చి యాక్షన్‌ థ్రిల్లింగ్‌ కథాంశంతో ఎంటర్‌టైన్‌ చేసేందుకు రెడీ అవుతున్నట్టు టీజర్‌తో అర్థమవుతోంది. నాంది ఫేం విజయ్‌ కనకమేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లరి నరేశ్‌ పోలీస్‌ గెటప్‌లో యాక్షన్‌ అవతార్‌లో కనిపిస్తున్న విజువల్స్‌తో టీజర్‌ మొదలైంది. నాది కాని రోజు కూడా నిన్ను లాగి నిలబెడతా… అర్థమైందా? అంటూ కాప్‌ గెటప్‌లో నరేశ్‌ చెప్తున్న డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. సినీ అభిమానులు అల్లరి నరేశ్‌లో ఇదివరకెన్నడూ చూడని సరికొత్త కోణాన్ని ఈ సినిమాలో చూడబోతున్నట్టు టీజర్‌తో తెలిసిపోతుంది. ఈ చిత్రంలో మలయాళ భామ మిర్ణా కథానాయికగా నటిస్తోంది. ఉగ్రం సినిమాకు టూమ్‌ వెంకట్‌, అబ్బూరి రవి కథ, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది తెరకెక్కిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల అందిస్తున్న బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సంగీతం సినిమాకు హైలెట్‌గా నిలవబోతున్నట్టు టీజర్‌ ద్వారా తెలుస్తోంది. ఈ మూవీ మే 5న థియేటర్లలో సందడి చేయనుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img