Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

ఎన్‌బీకే 108లో ‘శ్రీలీల’ పాత్రపై నెట్టింట చర్చ

హైదరాబాద్‌: నందమూరి బాల కృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం ఎన్‌బీకే 108. అనిల్‌ రావిపూడి దర్శ కత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన స్టిల్స్‌ నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. కాగా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఎన్‌బీకే 108లో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ చిత్రంలో పెళ్లి సందడి ఫేం శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. శ్రీలీల ఇందులో బాలయ్య కూతురుగా కనిపించబోతున్నట్టు ఇప్పటిదాకా వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. కాగా దీనికి సంబంధించి మరో వార్త తెరపైకి వచ్చింది. శ్రీలీల ఈ సినిమాలో బాలకృష్ణ స్నేహితుడి కూతురుగా కనిపించనుందట. ఇంతకీ బాలకృష్ణ స్నేహితుడెవరనే కదా మీ డౌటు… స్టార్‌ యాక్టర్‌ శరత్‌కుమార్‌. అంతేకాదు సినిమాలో ఓ ట్విస్ట్‌ ఉండబోతుండగా… బాలకృష్ణ, శ్రీలీల మధ్య బాండిరగ్‌ స్టోరీలో చాలా కీలకంగా సాగనుందని తెలిసింది. ఇప్పటివరకు రాయలసీయ యాసలో అలరించిన బాలకృష్ణ… ఈ సారి మాత్రం పక్కా తెలంగాణ యాసలో ఎంటర్‌టైన్‌ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలియజేశాడు అనిల్‌ రావిపూడి. ఈ సినిమాను షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాల తర్వాత ఎస్‌ థమన్‌ మరోసారి అదిరిపోయే బీజీఎం, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందించేందుకు రెడీ అవుతున్నాడు. తాజా అప్‌డేట్‌ ప్రకారం ఎన్‌బీకే 108 షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img