Tuesday, September 27, 2022
Tuesday, September 27, 2022

‘ఎఫ్‌3’లో అంతకుమించిన హాస్యం!

హైదరాబాద్‌ : విక్టరీ వెంకటేష్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోలుగా నటిస్తున్నట ‘ఎఫ్‌3’ సినిమా చిత్రీకరణ శుక్రవారం హైదరా బాద్‌ లో ప్రారంభమైంది. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న నటీ నటులంతా ఈ షెడ్యూ ల్‌లో పాల్గొన్నారు. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేయడానికి చిత్ర బృందం శ్రమిస్తోంది. ‘ఎఫ్‌2’ ఎంతగా నవ్వులు పూయించిందో… అంతకు మించి ఈ చిత్రం హాస్యాన్ని పంచబోతోందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి ‘ఎఫ్‌ 3’ కోసం వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌లకు ప్రత్యేకమైన మ్యానరిజం, బాడీ లాంగ్వేజ్‌ను క్రియేట్‌ చేశారు. ‘ఎఫ్‌2’ పాటలను మించేలా దేవిశ్రీప్రసాద్‌ ట్యూన్లు అందిస్తు న్నారు. తాజాగా విడుదల చేసిన మేకింగ్‌ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ చిత్రంలో సునీల్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీశ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img