Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

ఎఫ్‌`3 భారీ షెడ్యూల్‌ పూర్తి

హైదరాబాద్‌ : రెండేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా విడుదలై.. బ్లాక్‌ బస్టర్‌ సొంతం చేసుకున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఎఫ్‌2’. అజేయ దర్శకుడు అనిల్‌ రావిపూడి మలిచిన ఈ సినిమా నవ్వుల్ని పూయించింది. వెంకీ, వరుణ్‌ తేజ్‌ నటన, తమన్నా, మెహ్రీన్‌ గ్లామర్‌ షో, సాంగ్స్‌, కామెడీ పంచులు సినిమాని ఓ రేంజ్‌ లో నిలబెట్టాయి. ఇప్పుడు అదే చిత్రానికి సీక్వెల్‌ గా ‘ఎఫ్‌ 3’ రూపొందుతోంది. అవే పాత్రలతో, కామెడీ మోతాదు పెంచుతూ.. అనిల్‌ చేస్తోన్న మరో కామెడీ మాయాజాలంలో సునీల్‌, బోమన్‌ ఇరానీ, ఇంకా మరికొందరు నటీనటులు అదనంగా చేరుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్‌గా ‘ఎఫ్‌ 3’ చిత్రం హైద్రాబాద్‌లో భారీ షెడ్యూల్‌ కంప్లీట్‌ చేసుకున్నట్టు వరుణ్‌ తేజ ట్విట్టర్‌లో తెలిపారు. ‘ఎఫ్‌ 3 మూవీ భారీ క్రేజీ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమా పిచ్చిగా నవ్వులు పండిస్తుంది. సోదరుడు వెంకీతో నటిస్తుంటే ఎప్పుడూ నాకు ఉత్సాహమే. తదుపరి షెడ్యూల్‌ వరకూ ఆగలేకపోతున్నాను’… అంటూ ఓ వ్యాఖ్యను జోడిరచి.. తను, వెంకటేశ్‌ దిగిన ఓ ఫోటోను షేర్‌ చేశారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎఫ్‌ 2 స్థాయిలోనే భారీ సక్సెస్‌ ను సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img