Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

‘ఎయిట్‌’తో స్నేహా ఉల్లాల్‌ రీ ఎంట్రీ

హైదరాబాద్‌ : కమెడియన్‌ సప్తగిరి హీరోగా నటి స్తున్న సినిమాతో స్నేహా ఉల్లాల్‌ రీ ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘కరెంట్‌’, ‘సింహా’ వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న స్నేహ ఉల్లాల్‌ ఎందుకనో స్టార్‌ హీరో యిన్‌ కాలేకపోయింది. ఉన్నట్టుండి తెలుగు తెరకు దూరమైంది. మళ్లీ చాలాకాలానికి వెబ్‌ సిరీస్‌లలో నటించే అవకాశం అందుకొని వెలుగులోకి వచ్చిన ఆమె తాజాగా సప్తగిరి సరనస ‘ఎయిట్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం అందుకొని రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాను రిజ్వాన్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. చూడాలి మరి చాలాకాలం తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న స్నేహ ఉల్లాల్‌కి ‘ఎయిట్‌’ సినిమా ఏమాత్రం కలిసి వస్తుందో.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img