Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

ఓటీటీకి సెన్సార్‌ ఉండాల్సిందే: సల్మాన్‌ఖాన్‌

ముంబై: ఓటీటీ మాధ్యమాల ప్రభావం బాగా పెరిగిపోయిన తరుణంలో ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ఇంటి దగ్గరే చూసేస్తున్నారు. అయితే ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ అయ్యే కంటెంట్‌పై సెన్సార్‌షిప్‌ లేకపోవడం సమస్యగా మారింది. తాజాగా ఈ విషయంపై బాలీవుడ్‌ అగ్ర హీరో సల్మాన్‌ఖాన్‌ స్పందిస్తూ ‘ఓటీటీ కంటెంట్‌పై తప్పకుండా సెన్సార్‌షిప్‌ ఉండాలి. అప్పుడే శృంగార, అశ్లీల, హింసాత్మక దృశ్యాల్ని అడ్డుకోగలమన్నారు. పదిహేనేళ్ల వయసున్న మన పిల్లలు మొబైల్‌ ఫోన్లలో చూసే కంటెంట్‌ ఏమిటో మనకు తెలియకపోతే ఎలా? మితిమీరిన రొమాంటిక్‌ దృశ్యాలు అందుబాటులో ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఓటీటీ మీద తప్పకుండా సెన్సార్‌షిప్‌ ఉండాల్సిందే’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం చాలా మంది దర్శకనిర్మాతలు క్లీన్‌ కంటెంట్‌ మీదనే దృష్టి పెడుతున్నారని, అలాంటి కథలే ఎక్కువ మందికి చేరువవుతున్నాయని సల్మాన్‌ఖాన్‌ అభిప్రాయపడ్డారు. సల్మాన్‌ తాజా చిత్రం ‘కీసీ కా భాయ్‌ కీసీ కి జాన్‌’ ఈ నెల 21న విడుదలకానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img