Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

ఓటీటీలో దూసుకెళ్తోన్న‌ లెస్బియ‌న్  చిత్రం `హోలీ వుండ్‌`

 స‌హ‌స్ర సినిమాస్ ప్రై. లి స‌మ‌ర్ప‌ణ‌లో జాన‌కి సుంద‌ర్‌, అమృతా వినోద్‌, సాబు ప్రౌదిక్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో    సందీప్ ఆర్ మ‌ల‌యాళంలో నిర్మించిన చిత్రం `హోలీవుండ్‌`. అశోక్ ఆరాన్ ద‌ర్శ‌కుడు.  లెస్బియ‌న్ నేప‌థ్యంలో రూపొందిన  ఈ  సైలెన్స్ సినిమా  ఎన్నో కాంట్ర‌వ‌ర్సీల మ‌ధ్య ఈ నెల 12న ఎస్ ఎస్ ఫ్రేమ్స్ ఓటీటీ ద్వారా గ్రాండ్ గా రిలీజై మొద‌టి రోజే ల‌క్ష‌ల మంది వీక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది.  
 ఈ సంద‌ర్భంగా నిర్మాత మాట్లాడుతూ…“మ‌ల‌యాళంలో వ‌చ్చిన మొద‌టి లెస్బియ‌న్  చిత్రానికి బుకింగ్స్ చూసి మేమే ఆశ్చ‌ర్య‌పోయాం. వేరే ఓటీటీల్లో  ల‌క్ష‌ల్లో వీక్ష‌కులు అవ‌కాశం త‌క్కువ‌.  ఎస్ ఎస్ ఫ్రేమ్స్ లో కేవ‌లం 18 గంట‌ల్లో మూడు ల‌క్ష‌ల మంది సినిమా చూశారు. ఈ చిత్రం చూడ‌టానికి ఓటీటీ యాప్ డౌన్ లోడ్ అవ‌స‌రం లేదు. పైన ఉన్న వెబ్ సైట్ ఓపెన్ చేసి టిక్కెట్ బుక్ చేసుకోవ‌చ్చు.  మ‌ల‌యాళంలో ఇంత‌గా ప‌బ్లిసిటీ…చేసిన  లెస్బియ‌న్ సినిమా లేదు. ఈ సినిమా కోసం ఎంతో మంది యువ‌కులు ఎదురు చూశారు. సినిమా చూశాక వాళ్లు ఎదురు చూసిన దానికి మించి ఉందంటూ చెప్పడం విశేషం. ఈ చిత్రాన్ని 18 ఏళ్ల లోపు పిల్ల‌లు చూడ‌కూడదు. ఇంకా ఈ సినిమా పై కొంత మంది రాజ‌కీయం చేస్తున్నారు కానీ..అలాంటి కాంట్ర‌వ‌ర్సీ చిత్ర‌మిది కాదు“ అన్నారు.
ఈ చిత్రానికి  డీఓపిః ఉన్ని మాధ‌వూర్‌; సంగీతంః రోన్ రాఫిల్ ;  స్క్రీన్ ప్లేః పాల్ విక్‌లిఫ్‌; ఎడిటింగ్ః విపిన్ మానూర్; ద‌ర్శ‌కుడుః అశోక్ ఆరాన్‌,  నిర్మాతః సందీప్ ఆర్‌.   

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img