Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

‘కాంచన`3’ నటి అనుమానాస్పద మృతి

పనాజీ : ‘కాంచన 3’ హీరోయిన్స్‌లో ఒకరైన నటి, రష్యన్‌ మోడల్‌ అలెగ్జాండ్రా జావి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. గోవాలో ఆమె అద్దెకు ఉంటున్న అపార్ట్‌మెంట్‌ గదిలో శుక్రవారం ఉరివేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘కాంచన 3’లో పగ తీర్చుకునే దెయ్యం పాత్రలో కనిపించిన ఆమె ఆకస్మిక మరణం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె చనిపోవడం, మూడు రోజుల తర్వాత ఆ వార్త బయటకు రావడంతో అందరూ షాక్‌ అవుతున్నారు. అలెగ్జాండ్రా కొద్దిరోజుల కిందట తన ప్రియుడితో మనస్పర్థలు వచ్చి విడిపోయినట్లు సమాచారం. ఆ కారణంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తు న్నారు. మరోవైపు ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణం లోనూ గోవా పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా చెన్నైలోని ఓ యాక్టింగ్‌ స్కూల్‌లో చేరిన అలెగ్జాండ్రా ఇటీవల అక్కడి ఫొటో గ్రాఫర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడు లైంగిక వేధిం పులకు గురిచేస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img