Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

కాంతార`2లో ఊర్వశి రౌతేలా?


హైదరాబాద్‌: జనవరి లో సంక్రాంతి పండుగకు విడుదల అయిన ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవితో ‘బాస్‌ పార్టీ’ పాట లో ఆడి పాడిన ఊర్వశి రౌతేలా ఇప్పుడు ఇంకో పెద్ద ప్రాజెక్ట్‌ లో ఛాన్స్‌ కొట్టేసింది. హిందీ సినిమాలతో పాపులర్‌ అయిన ఈ నటి, ఇప్పుడు దక్షిణాది సినిమాల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఊర్వశి తన సాంఫీుక మాధ్యమం లో ‘కాంతారా’ దర్శకుడు, నటుడు అయిన రిషబ్‌ శెట్టి తో ఒక ఫోటో షేర్‌ చేసింది. అయితే ఈమె ‘కాంతారా -2’ లో కథానాయకురాలి గా రిషబ్‌ శెట్టి పక్కన నటిస్తున్నట్లు సమాచారం. ‘కాంతారా 2’ ఆమధ్య విడుదల అయినా ‘కాంతారా’ కి సీక్వెల్‌ కాదు కాబట్టి అందులో వున్న నటులే అవసరం లేదు. అందుకే ఊర్వశి రౌతేలాని కథానాయికగా రిషబ్‌ శెట్టి తీసుకున్నాడని, అందుకనే ఆమెని కలవడానికి ముంబై వెళ్లి కథ చెప్పాడని కూడా తెలిసింది. అప్పుడే ఆమె రిషబ్‌ శెట్టి తో ఒక ఫోటో షేర్‌ చేసిందని కూడా చెప్తున్నారు. ఊర్వశి రౌతేలా ఇప్పుడు టాలీవుడ్‌ లో స్పెషల్‌ సాంగ్‌ కి బాగా పాపులర్‌ అయిన నటిగా ప్రాచుర్యం పొందింది. చిరంజీవి తో చేసిన తరువాత ఇప్పుడు రామ్‌ పోతినేని తో కొత్త సినిమాలో కూడా స్పెషల్‌ సాంగ్‌ చేస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img