హైదరాబాద్: నందమూరి కళ్యాణ్‌రామ్ నటిస్తున్న అమిగోస్ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది. రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 10న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం సినిమా గూర్చిన విశేషాలను పంచు కుంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్ త్రిపాత్రాభినయం చేస్తుండగా, అందులో మొదటి రోల్‌కు సంబంధించిన పోస్టర్‌ను న్యూఇయర్ సందర్భంగా రిలీజ్ చేశారు. తాజాగా రెండో రోల్‌కు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. మొదటి పోస్టర్లో వ్యాపారవేత్తగా సిద్ధార్థ్ పాత్రలో స్టైలిష్ లుక్‌లో కనిపించిన కళ్యాణ్‌రామ్… సెకండ్ పోస్టర్లో సాఫ్ట్‌వేర్‌గా మంజునాథ్ పాత్రలో అమాయకంగా కనిపిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్‌కు జోడీగా అశికా రంగనాథ్ హీరోయిన్గా నటించింది. జిబ్రాన్ సంగీత అందించారు. సంక్రాంతి తర్వాత ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా జరుపాలని మైత్రీ సంస్థ భావిస్తోంది.