Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

క్షేమంగా ఇంటికి…

చెన్నై : ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజనీకాంత్‌ ఆదివారం రాత్రి హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అంతకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పరామర్శించారు. ఆదివారం చెన్నైలోని కావేరి ఆస్పత్రికి వెళ్లి రజనీ బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు వైద్యం చేస్తున్న డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రజనీ త్వరలోనే కోలుకుని ఇంటికి చేరుకోవాలని ఈ సందర్భంగా స్టాలిన్‌ ఆకాంక్షించారు. నాలుగు రోజుల క్రితం రజనీ అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు కావేరి ఆస్పత్రికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన మెదడు రక్తనాళంలో ఏర్పడిన అడ్డంకుల (బ్లాక్స్‌)ను వైద్యులు చికిత్స చేసి తొలగించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img