Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

చిరంజీవి సినిమాలో సుశాంత్‌


మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భోళా శంకర్‌’. మెగా మాసివ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని క్రియేటివ్‌ కమర్షియల్స్‌తో కలిసి అనిల్‌ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి సిస్టర్‌గా కీర్తి సురేష్‌ నటిస్తుండగా.. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్‌ని మేకర్స్‌ తెలియజేశారు. ఈ సినిమాలో అక్కినేని ఫ్యామిలీ హీరో ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్లుగా తెలుపుతూ.. అతని లుక్‌ని కూడా విడుదల చేశారు. ఇంతకీ ఈ సినిమాలో నటిస్తున్న అక్కినేని ఫ్యామిలీ హీరో ఎవరంటే.. సుశాంత్‌. ఇంతకు ముందు అల్లు అర్జున్‌ ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో సుశాంత్‌ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి మెగా హీరో చిత్రంలో సుశాంత్‌ నటిస్తున్నారు. సుశాంత్‌ పుట్టినరోజును పురస్కరించుకుని.. మేకర్స్‌ ‘భోళా శంకర్‌’ చిత్రంలో సుశాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుపుతూ.. శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక వైపు సుశాంత్‌ లీడ్‌ రోల్స్‌ చేస్తూనే.. మంచి పాత్ర అయితే ఇతర హీరోల సినిమాలలో కూడా చేస్తున్నారు. ‘భోళా శంకర్‌’లో అతని పాత్ర చాలా కీలకంగా వుంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో.. సూట్‌లో లైట్‌ గడ్డంతో ఛార్మింగ్‌గా సుశాంత్‌ కనిపిస్తున్నారు. ఈ లుక్‌ చూస్తుంటే అతనిది ఇందులో లవర్‌ బాయ్‌ తరహా పాత్ర అనేది అర్థమవుతుంది. కీర్తి సురేష్‌ లవర్‌గా సుశాంత్‌ ఇందులో చేస్తున్నట్లుగా టాక్‌ నడుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img