Friday, March 31, 2023
Friday, March 31, 2023

‘ఛత్రపతి’ హిందీ వెర్షన్‌ విడుదలకు సన్నాహాలు?

హైదరాబాద్‌: పద్దెనిమిదేళ్ల క్రితం విడుదలై సంచలనం సృష్టించిన ‘ఛత్రపతి’ రీమేక్‌తో బెల్లంకొండ శ్రీనివాస్‌ హిందీలో అరంగేట్రం చేస్తున్నాడు. మాస్‌ సినిమాలకు పెట్టిన పేరైన వీవీ వినాయక్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం ఈ సినిమా నిర్మాణంపై ప్రకటన వచ్చిన సినిమా ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. ఒకానొక సమయంలో ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజవుతుందంటూ వార్తలు కూడా వచ్చాయి. కాగా గతకొంత కాలంగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లు ఎలాంటివి రాకపోవడంతో అసలు ఈ సినిమా ఉందన్న విషయమే ప్రేక్షకులు మెల్లిమెల్లిగా మర్చిపోయారు. ఇలాంటి సమయంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఛత్రపతి హిందీ రీమేక్‌ను మే5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటి నుంచే ప్రమోషన్‌లను జరిపే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలిసింది. ఇప్పటి వరకైతే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేవు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్‌ సినిమాల హిందీ వెర్షన్‌కు యూట్యూబ్‌లో మిలియన్లలో వ్యూస్‌ ఉన్నాయి.
దాంతో ప్రమోషన్‌లను గ్రాండ్‌గా జరిపితే మంచి ఓపెనింగ్స్‌ వచ్చే అవకాశం ఉందని మేకర్స్‌ భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img