Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

ఛాయ్ వాలతో జత కలిసిన నయనతార

ఛాయ్ వ్యాపారమే కదా అని చిన్నగా తీసుకోలేదు. నయనతార తనకు ఆసక్తి ఉన్న రంగం అంటూ.. మంచి భవిష్యత్తు ఉన్న రంగంగా భావించి ఛాయ్ వాలె సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్న ఛాయ్ వాలె సంస్థ కు నయనతార మరియు విఘ్నేష్ శివన్ లు కూడా తోడు అవ్వడంతో భారీగా పబ్లిసిటీ కూడా దక్కింది. దేశ వ్యాప్తంగా మెట్రో నగరాలు మరియు షాంపిగ్ మాల్స్ లో మెట్రో స్టేషన్స్ లో ఛాయ్ వాలె ను ఏర్పాటు చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఛాయ్ వాలె లో అమెరికన్ ఎన్నారై లు కూడా పెట్టుబడులు పెట్టడంతో పాటు సంస్థను విస్తరించేందుకు తమ వంతు సహకారంను అందిస్తున్నారు. ఇలాంటి సమయంలో నయనతార మరియు విఘ్నేష్ శివన్ లు పెట్టుబడి పెట్టారని.. వస్తున్న పెట్టుబడులతో ఫిజికల్ స్టోర్స్ విస్తరణకు సిద్దం అవుతున్నట్లుగా ఛాయ్ వాలె ఫౌండర్ విధుర్ మహేశ్వరి అన్నారు. ఛాయ్ వాలె చిన్న సంస్థ అయినా కూడా నయనతార పెట్టుబడితో ఒక్కసారిగా బ్రాండ్ వాల్యూ పెరిగినట్లయ్యింది. ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆమె నటించిన ఒక సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు సిద్దం చేశారు. ఆ సినిమా లో నయన్ గుడ్డి అమ్మాయి పాత్రలో కనిపించబోతుంది. ఇంకా ఈమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. వెబ్ సిరీస్ ల కోసం కూడా ఈమెను సంప్రదిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్లో కూడా ఈమె నటించేందుకు సిద్దం అవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈమె ప్రియుడు విఘ్నేష్ శివన్ తో ఈ కరోనా తర్వాత పెళ్లి పీఠలు ఎక్కేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img