Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

జర్నలిస్టు పాత్రలో తాప్సీ

తాప్సీ పన్ను..తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌ సినిమాలతో పాటు.. టాలీవుడ్‌లో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ అనే సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే తాప్సీ ఈ సినిమాలో నటిస్తోందని ప్రకటించి చాలాకాలమైంది. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్‌ స్వరూప్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్‌ పై నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డిలు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రగా తాప్సీ ఓ జర్నలిస్టు పాత్రలో నటిస్తోందట. మార్క్‌ కె రాబిన్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి దీపక్‌ యారగర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img