Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

‘టక్‌ జగదీష్‌’ ట్రైలర్‌ అదుర్స్‌

హైదరాబాద్‌ : హీరో నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో రూపొందిన ‘టక్‌ జగదీష్‌’ ట్రైలర్‌ ను బుధవారం విడుదల చేశారు.
దాదాపు అన్ని వైపుల నుంచి కథను కవర్‌ చేస్తూ ట్రైలర్‌ ను రూపొందించారు. గ్రామీణ నేపథ్యంలో లవ్‌, యాక్షన్‌, ఎమోషన్‌ కి సంబంధించిన సన్నివేశాలపై కట్‌ చేసిన ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉంది. తన ఊరి బాగు కోసం .. తన కుటుంబాన్ని నిలబెట్టడం కోసం నడుం బిగించే మంచి మనసున్న వాడిగా ‘టక్‌ జగదీష్‌’ కనిపిస్తున్నాడు. నాని సరసన నాయికగా రీతూ వర్మ అలరించనుండగా, నాని అన్నయ్య పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు. ఇక ప్రతినాయకుడి పాత్రలో డేనియల్‌ బాలాజీ నటిస్తున్నాడు. గతంలో నాని – శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన ‘నిన్నుకోరి’ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అంతకు మించిన హిట్‌ అవుతుందేమో చూడాలి. సాహు గారపాటి – హరీశ్‌ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img