Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

తారక్‌, భన్సాలి మూవీ ‘జై భవ్‌ రే’..?

ముంబై : యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లో గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారని, దాన్ని కళాత్మక దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించనున్నారన్న వార్త కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా సెట్స్‌ మీదకు తీసుకెళ్లాలనేంతగా ఆ సినిమా నేపథ్యం, కథాంశం తారక్‌కు బాగా నచ్చేశాయట. ఈ సినిమాను ‘బాజీరావు మస్తానీ, పద్మావత్‌’ సినిమాల రేంజ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. పౌరాణిక నేపథ్యంలో సాగే ఓ చారిత్రాత్మక చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తారట. అయితే ఈ సినిమాకి ‘జై భవ్‌ రే’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖాయం చేయబోతున్నారట. ఈ టైటిల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సైతం ఈ సినిమాను విడుదల చేయబోతున్నారని టాక్‌. ఎన్టీఆర్‌ డెబ్యూ మూవీ ‘రామాయణం’ పౌరాణిక చిత్రమైనప్పటికీ.. అందులో ఆయన బాలనటుడు మాత్రమే. దాని తర్వాత మరెలాంటి పౌరాణిక చిత్రంలోనూ నటించలేదు. కానీ యమదొంగలో కాసేపు ‘యముడి’గా సమాస భూయిష్టమైన సంభాషణలు పలికి అభిమానుల్ని అలరించారు. అందుకే ఇప్పుడీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కళాత్మక చిత్రాలు తీయడంలో చేయితిరిగిన భన్సాలీ, పౌరాణిక చిత్రాలకు ప్రాణం పోసే టాలెంటున్న ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో రానున్న ఈ మూవీ ఏ కథాంశంతో తెరకెక్కబోతోందో కొద్దిరోజుల్లో క్లారిటీ రానుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా రాబోతోంది. మరి నిజంగానే ఈ ప్రాజెక్ట్‌ కు ‘జై భవ్‌ రే’ అనే టైటిల్‌ ఖాయం చేస్తారో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img