Friday, October 7, 2022
Friday, October 7, 2022

తెలుగు చిత్రాలపై ధనుష్‌ దృష్టి

హైదరాబాద్‌ : శేఖర్‌ కమ్ముల కలయికలో ఓ పాన్‌ ఇండియా సినిమాలో నటిస్తున్న కోలీ వుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌, తెలుగులో మొత్తం మూడు చిత్రాలు చేయనున్నాడని సమా చారం. శేఖర్‌ కమ్ములతో మూవీతో పాటు, వెంకీ అట్లూరి, అలాగే ఆర్‌ ఎక్స్‌ 100 డైరెక్టర్‌ అజయ్‌ భూపతితో కూడా చర్చలు జరుపుతున్నాడట. అజయ్‌ భూపతి మేకింగ్‌ చాలా వరకు కోలీవుడ్‌ ఆడియెన్స్‌కు దగ్గరగా ఉంటుందనీ అందుకే తనకోసం స్టోరీ రేడీ చేయమని చెప్పాడట. ఆర్‌ ఎక్స్‌ 100 తర్వాత మహా సముద్రం తెరకెక్కిస్తున్నాడు అజయ్‌. ఈ మూవీ పూర్తైన తర్వాత డైరెక్ట్‌ గా ధనుష్‌ తో పాన్‌ ఇండియా సినిమా తెరకెక్కించినా ఆశ్చర్యం లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img