హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినే షన్లో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ అనే మరో పవర్ ఫుల్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. దేవాలయ భూముల స్కామ్ నేపథ్యంలో సాగే ఓ ఆసక్తికరమైన కథతో సందేశాత్మక రీతిలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు కొరటాల. ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తయింది. ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయబోతున్నారు. ఇంతకు ముందు ‘ఆచార్య’ సినిమాకి సంబంధించిన టీజర్, ఫస్ట్ సింగిల్ అభిమా నుల్ని ఎంతగానో అలరించాయి. ఈ నేపథ్యంలో ఈనెల 5న ఉదయం 11:07 నిమిషాలకు.. రామ్‌చరణ్, ఆయన సరసన కథానాయికగా నటిస్తోన్న పూజా హెగ్డేలపై చిత్రీకరించిన ‘నీలాంబరి’ అనే పాటను సెకండ్ సింగిల్‌గా విడుదల చేస్తు న్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలిపారు నిర్మాతలు. మణిశర్మ సంగీతం అందించిన ఈ మెలోడియస్ డ్యూయెట్ సాంగ్‌పై ఇప్పటి నుంచే ఆసక్తి మొదలైంది. పీరియాడికల్ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాట మనల్ని ఆ కాలంలోకి తీసుకెళుతుందని తెలిపారు.