Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

త్వ‌ర‌లోనే అడివి శేష్ `గూఢ‌చారి` సీక్వెల్ అనౌన్స్‌మెంట్‌

దేశ‌భ‌క్తితో నిండిన పాన్ ఇండియా మూవీ `మేజ‌ర్‌`తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో అడివి శేష్‌. ఈ సినిమా మేజ‌ర్ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌వ‌గానే అడివి శేష్ త‌న కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన చిత్రం `గూఢ‌చారి` సినిమా సీక్వెల్‌ను చేయ‌బోతున్నారు. `గూఢ‌చారి` సినిమా విడుద‌లై మంగ‌ళ‌వారం(ఆగ‌స్ట్‌3) నాటికి మూడేళ్లు పూర్త‌య్యాయి. ఈ నెల‌లోనే `గూఢ‌చారి` సీక్వెల్‌కు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను చేయ‌బోతున్నారు. “గూఢ‌చారి మ‌ళ్లీ వ‌స్తున్నాడు.. ఈ నెల‌లోనే ప్ర‌క‌ట‌న ఉంటుంది` అంటూ మేక‌ర్స్ తెలిపారు. “ఈ రోజుతో గూఢ‌చారి మూడేళ్లు పూర్తి చేసుకుంది. నాకు చాలా ఇష్ట‌మైన సినిమా. ముఖ్యంగా ఈ సినిమాను పిల్ల‌లు చాలా ఇష్ట‌ప‌డి చూశారు. ఆగ‌స్ట్ నెల నాకు బాగా క‌లిసొస్తుంది. ఈ నెల‌లోనే నా నెక్స్‌ట్ సినిమా G2(గూఢ‌చారి2) కు సంబంధించిన అతి పెద్ద అప్‌డేట్‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాను“ అంటూ అడివిశేష్ ట్వీట్ చేశారు. గూఢ‌చారి చిత్రాన్ని శ‌శికిర‌ణ్ తిక్క డైరెక్ట్ చేశారు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన వివరాలు తెలియజేస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img