Friday, December 1, 2023
Friday, December 1, 2023

ధనుష్‌ కొత్త సినిమా అప్‌డేట్‌

తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన నటులలో ధనుష్‌ ఒకరు. నేరుగా తెలుగులో సినిమాలు చేయకపోయినా ఇక్కడ ఆయనకు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. హీరో రజనీకాంత్‌ అల్లుడు అయినప్పటికీ.. తనకంటూ ఓ ప్రత్యేకమన గుర్తింపు తెచ్చుకున్నాడు. విలక్షణమైన సినిమాలు చేస్తూ ప్రేక్షఖులను అలరిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ధనుష్‌ తన 43వ సినిమా షూటింగ్‌లో త్యాగరాజన్‌ సమర్పణలో జరుగుతోంది.ఈ చిత్రానికి కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి.. ఫస్ట్‌లుక్‌ను జులై 28వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ సినిమాలో మాళవిక మోహనన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img