Saturday, November 26, 2022
Saturday, November 26, 2022

నటి హేమకు షోకాజ్‌ నోటీసులు

‘మా’ అసోసియేషన్‌ ఎన్నికల వివాదంలో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. మా అసోసియేషన్‌ పై బహిరంగ ప్రకటనలు చేసిన నటి హేమకు తాజాగా షోకాజ్‌ నోటీసులు జారీ అయ్యాయి. ‘మా’ అధ్యక్షుడు నరేష్‌ నిధులు దుర్వినియోగం చేశారంటూ నటి హేమ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సభ్యులతో హేమ మాట్లాడిన వాయిస్‌ రికార్డు కలకలం రేపింది.ఇది కాస్తా చినికి చినికి గాలివానగా మారింది. దీనిపై జీవిత, నరేష్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.అసోసియేషన్‌ గౌరవాన్ని దెబ్బతీసేలా హేమ మాట్లాడుతున్నారని నరేష్‌ అన్నారు. క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామని, కమిటీ నిర్ణయం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో నటి హేమపై క్రమశిక్షణా సంఘం షోకాజ్‌ నోటీసులు జారీచేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img