Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

నాగలక్ష్మిగా ఆకట్టుకుంటున్న కృతిశెట్టి

హైదరాబాద్‌ : అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా.. కళ్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ బంగార్రాజు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ సూపర్‌ హిట్‌ చిత్రానికిది సీక్వెల్‌ అన్న సంగతి తెలిసిందే. అందులో ఆత్మగా అలరించిన నాగ్‌ బంగార్రాజు పాత్రకిది ఎక్స్‌టెన్షన్‌. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌ పై ఉండగా.. చైతూ సరసన కథానాయికగా నటిస్తోన్న కృతిశెట్టి నాగలక్ష్మి పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేశారు. చీరకట్టుతో మెరిసిపోతూ.. మెడలో దండలతో రివీలైన ఆమె మేకోవర్‌ ఆకట్టుకుంటోంది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ లుక్‌ వైరల్‌ అవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కాను కగా ఈ సినిమాను విడుదల చేయడానికి నాగార్జున ప్రయ త్నిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి సంబంధిం చిన సింగిల్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్డూడియోస్‌ బ్యానర్‌పై నాగార్జున నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img