Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

నా వల్లే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ఆస్కార్‌: అజయ్‌


ముంబై: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి ‘ఆస్కార్‌’ రావడంపై బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గన్‌ స్పందించారు. తన వల్లే ఆస్కార్‌ వచ్చిందంటూ సరదాగా వ్యాఖ్యలు చేశారు. తన తదుపరి చిత్రం ‘భోలా’ ప్రమోషన్స్‌లో భాగంగా కపిల్‌ శర్మ షోలో పాల్గొన్న ఆయన్ని.. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి ఆస్కార్‌ వచ్చింది కదా. అందులో మీరూ నటించారు కాబట్టి ఆ సినిమాకు సంబంధించి ఏదైనా విశేషాలు పంచుకోగలరు?’ అని వ్యాఖ్యాత కోరాడు. దీనిపై అజయ్‌ స్పందిస్తూ.. ‘నా వల్లే ఆస్కార్‌ వచ్చింది. ఒకవేళ నేనే ఈ పాటకు డ్యాన్స్‌ చేసుంటే ఏమయ్యేదో తెలుసుగా..!’’ అంటూ సరదాగా నవ్వులు పూయించారు. ఆయన మాటతో ఆ షోలో ఉన్న వారందరూ చిరునవ్వులు చిందించారు. ‘దృశ్యం 2’ తర్వాత అజయ్‌ దేవ్‌గన్‌ నటించిన చిత్రం ‘భోలా’. తమిళంలో సూపర్‌ సక్సెస్‌ సొంతం చేసుకున్న కార్తి ‘ఖైదీ’కి రీమేక్‌గా ఇది సిద్ధమైంది. టబు కీలకపాత్ర పోషించారు. మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img