Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

‘పుష్ప- ది రైజ్’ తొలి సింగిల్ ‘దాక్కో దాక్కో మేక’..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే చాలు అభిమానులు ఊగిపోతారు. ఈ కాంబినేషన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది. ఈ ముగ్గురు పేర్లు ఒక పోస్టర్ పై కనిపిస్తే థియేటర్ బయట జనాలు డాన్స్ చేస్తారు. సుకుమార్, అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య 2 పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. పదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘పుష్ప’. ఆగస్టు 13 ఉదయం 11:07 నిమిషాలకు 5 భాషల్లో ‘పుష్ప-ది రైజ్’ తొలి సింగిల్ విడుదలైంది. పాట విడుదలైన మరుక్షణం నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ మేకోవర్ ఈ పాటలో హైలైట్‌గా నిలిచింది. నోటిలో కత్తి పెట్టుకొని ఐకాన్ స్టార్ చేసిన డాన్స్ లకు అభిమానులు, ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఐదు భాషల్లో 5గురు లీడింగ్ సింగర్స్ ఈ పాట పాడారు. తెలుగులో శివం.. హిందీలో విశాల్ దడ్లాని.. కన్నడంలో విజయ్ ప్రకాష్.. మలయాళంలో రాహుల్ నంబియార్.. తమిళంలో బెన్నీ దయాల్.. దాక్కో దాక్కో మేక పాటను ఆలపించనున్నారు. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. రెండు భాగాలుగా పుష్ప సినిమా రానుంది. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. క్రిస్మస్ సందర్భంగా ‘పుష్ప- ది రైజ్’ విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

పాట లిరిక్స్..

తందానే.. తాన తందానానేనా.. (2)
తానాని తనినరీనానే..
అ.. అ.. అ.. అఅఅ..
వెలుతురు తింటది ఆకు.. ఆకును తింటది మేక..
మేకను తింటది పులి.. ఇది కదరా ఆకలి..
అ.. అ.. అ.. అఅఅ..
పులినే తింటది చావు.. చావును తింటది కాలం..
కాలాన్ని తింటది ఖాళీ.. ఇది మహా ఆకలి..
అ.. అ.. అ.. అఅఅ..
వేటాడేది ఒకటి.. పరిగెత్తేది ఇంకొకటి..
దొరికిందా ఇది సస్తాది.. దొరక్కపోతే అది సస్తాది..
ఒక జీవికి ఆకలేసిందా.. ఇంకో జీవికి ఆయువు మూడిందే..
హే దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకొద్దీ పీక..
చాపకు పురుగు ఎరా.. పిట్టకు నూకలు ఎరా..
కుక్కకు మాంసం ముక్క ఎరా.. మనుషులందరికీ బతుకే ఎరా..
గంగమ్మ తల్లి జాతర.. కోళ్లు పొట్టేళ్ళు కోతరా..
కత్తికి నెత్తుటి పూతర.. దేవతకైనా తప్పదు ఎరా..
ఇది లోకం తలరాతరా..
అ.. అ.. అ.. అఅఅ..
ఏమరపాటుగా ఉన్నావా.. ఎరకే చిక్కేస్తావు..
ఎరనే మింగే ఆకలుంటేనే ఇక్కడ బతికుంటావు..
కాలే కడుపు సూడదురో నీతి న్యాయం..
బలం ఉన్నోడిదేరా ఇక్కడ ఇష్టారాజ్యం..
హే దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకొద్దీ పీక..
అడిగితే పుట్టదు అరువు.. బతిమాలితే బతుకే బరువు..
కొట్టర ఉండదు కరువు.. దేవుడికైనా దెబ్బే గురువు..
తన్నులు సేసే మేలు.. తమ్ముడు కూడా సెయ్యడు..
గుద్దుడు సెప్పే పాఠం.. బుద్ధుడు కూడా సెప్పడహే..

నటీనటలు:
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు

టెక్నికల్ టీం:
దర్శకుడు: సుకుమార్
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
కో ప్రొడ్యూసర్స్: ముత్తంశెట్టి మీడియా
సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: S. రామకృష్ణ – మోనిక నిగొత్రే
సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ R
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్
లిరిసిస్ట్: చంద్రబోస్
క్యాస్ట్యూమ్ డిజైన్: దీపాలీ నూర్
మేకప్: నాని భారతి
CEO: చెర్రీ
కో డైరెక్టర్: విష్ణు
లైన్ ప్రొడ్యూసర్: KVV బాల సుబ్రమణ్యం
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ ముత్తంశెట్టి మీడియా
PRO: ఏలూరు శ్రీను, మడూరి మధు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img