Monday, January 30, 2023
Monday, January 30, 2023

‘పుష్ప’ విలన్‌ వచ్చేశాడు

హైదరాబాద్‌ : ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా మొదటి భాగం ఈ ఏడాది క్రిస్మస్‌ సంద ర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుందని నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్‌ గెటప్‌ని పరిచయం చేస్తూ విడుదల చేసిన ప్రోమోలు, అందులో అల్లు అర్జున్‌ గెటప్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా శనివారం ఈ సినిమాలో విలన్‌ పాత్రలో నటిస్తున్న మలయాళ స్టార్‌ హీరో ఫహద్‌ ఫాజిల్‌ లుక్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. ‘విలన్‌ ఆఫ్‌ పుష్ప’ పేరుతో ఫహద్‌ ఫస్ట్‌లుక్‌ను ట్వీటర్‌ వేదికగా పంచుకున్నారు. ఇందులో ఆయన భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ అనే పోలీస్‌ అధికారిగా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. ఫహాద్‌కు ఇదే తొలి తెలుగు సినిమా. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోంది. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్‌, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుకున్న ఈ సినిమా తొలిభాగాన్ని ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img