Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

పుష్ప-1′ లో ఫహాద్

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ”పుష్ప”. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో లారీ డ్రైవర్ పుష్పరాజ్ అనే ఊర మాస్ పాత్రలో బన్నీ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ – పుష్పరాజ్ ఇంట్రో వీడియో ద్వారా తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ అరాచకం ఈ చిత్రంలో ఏ రేంజ్ లో ఉంటుందో శాంపిల్ గా చూపించారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. అయితే ‘పుష్ప’ పార్ట్-1 లో ఫహాద్ కంటే కమెడియన్ కమ్ హీరో సునీల్ విలనిజం ఎక్కువగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ‘పుష్ప’ చిత్రంలో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే అది నెగెటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ రోల్ అని తెలుస్తోంది. అతని క్యారక్టరైజేషన్ – గెటప్ కొత్తగా ఉంటూ అందరినీ షాక్ కు గురి చేస్తాయని అంటున్నారు. సునీల్ కు జోడీగా యాంకర్ అనసూయ కనిపించనుంది. ‘డిస్కోరాజా’ ‘కలర్ ఫోటో’ చిత్రాల్లో విలన్ గా మెప్పించిన మెప్పించిన సునీల్ కోసం.. సుకుమార్ ప్రాధాన్యత పాత్ర ఇచ్చారని అంటున్నారు. అంతేకాదు ‘పుష్ప 1’ లో మెయిన్ విలన్ గా సునీల్ కనిపిస్తారని.. చివరలో ఎంటర్ అయ్యే ఫహద్ ఫాజిల్ ‘పుష్ప 2’ లో ప్రధాన ప్రతినాయకుడిగా కొనసాగుతారని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ఇదే కనుక నిజమైతే మాత్రం ‘పుష్ప’ సునీల్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పవచ్చు. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోని ఢీకొట్టే పాత్ర అంటే అతని కెరీర్ లోనే గుర్తుండి పోయేది అవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందే సినిమా కావడంతో సునీల్ పాత్ర వర్కౌట్ అయితే నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది. సినిమా రిలీజ్ అయితే కానీ విలన్ ఎవరు కమెడియన్ ఎవరనేది తెలుస్తుంది. ఇకపోతే ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ప్రకాష్ రాజ్ – జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ‘పుష్ప’ మొదటి భాగానికి సంబంధించిన మెజారిటీ షూటింగ్ ఇప్పటికే పూర్తి పూర్తయింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తర్వాత ఇటీవల ఈ సినిమాని తిరిగి ప్రారంభించారు. ఏకధాటిగా 40 రోజుల పాటు ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్ తో పార్ట్ 1కు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మళ్ళీ షూట్ కి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. చిత్రీకరణ లేట్ అయినా ఈ ఏడాది చివరికి ‘పుష్ప 1’ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. అల్లు అర్జున్ – సుకుమార్ చెరొక బయటి ప్రాజెక్ట్ చేసి వచ్చిన తర్వాత ‘పుష్ప’ రెండో భాగాన్ని మొదలు పెట్టనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – వై రవిశంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఆస్కార్ గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ‘పుష్ప’ విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img