Friday, June 9, 2023
Friday, June 9, 2023

పూరీ తదుపరి సినిమా రామ్‌తో?

హైదరాబాద్‌: లైగర్‌ సినిమా డిజాస్టర్‌ తర్వాత పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించే తదుపరి సినిమా ఏంటనే దానిపై డైలామా ఏర్పడిరది. ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్‌ మరోసారి రామ్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. పూరీ జగన్నాథ్‌, ఛార్మీ బ్యానర్‌ పూరీ కనెక్ట్స్‌ పై రామ్‌ హీరోగా మరో సినిమా రాబోతుందని తాజా సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా ఈ వార్తను మాత్రం ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు రామ్‌ అభిమానులు. రామ్‌-పూరీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రం ఏ జోనర్‌లో ఉండబోతుంది.. మళ్లీ బాక్సాఫీస్‌ వద్ద ఏ రేంజ్‌లో రికార్డులు సృష్టించబోతుందోనని అప్పుడే అంచనాలు వేసుకుంటున్నారు మూవీ లవర్స్‌. ఎందుకంటే ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో రామ్‌కు బ్లాక్‌ బస్టర్‌ హిట్టందించాడు పూరీ జగన్నాథ్‌. రామ్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో 20వ సినిమా చేస్తున్నాడు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఈ ఏడాది దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. బోయపాటి-రామ్‌ సినిమా పూర్తయిన తర్వాత పూరీ-రామ్‌ క్రేజీ కాంబో ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. మరి దీనిపై రామ్‌ ఏదైనా స్పందిస్తాడేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img