Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

ప్రభాస్‌-సందీప్‌ రెడ్డి వంగా ‘స్పిరిట్‌’

హైదరాబాద్‌ : పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ 25వ సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి ‘స్పిరిట్‌’ అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్‌ చేస్తూ మేకర్స్‌ సోషల్‌ మీడియా ద్వారా అధికారకంగా ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ప్రభాస్‌ కెరీర్‌ లో ల్యాండ్‌ మార్క్‌ సిల్వర్‌ జూబ్లీ మూవీకి భూషణ్‌ కుమార్‌-వంశీ-ప్రమోద్‌-వంగా ప్రణయ్‌ రెడ్డి నిర్మాతలు. ‘స్పిరిట్‌’ అనే వెరైటీ టైటిల్‌తో పాన్‌ ఇండియా మూవీగా, టి సిరీస్‌-యూవీ క్రియేషన్స్‌-సందీప్‌ వంగా సొంత నిర్మాణ సంస్థ అయిన భద్రకాళి పిక్చర్స్‌ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. కాగా ప్రభాస్‌ ప్రస్తుతం ‘రాధే శ్యామ్‌’ పాటు ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమాలలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ‘రాధే శ్యామ్‌’ రిలీజ్‌ కానుంది. అలాగే ఆగస్ట్‌ 11న ‘ఆదిపురుష్‌’ రిలీజ్‌ చేయనున్నారు. ఇక సందీప్‌ రెడ్డి-ప్రభాస్‌ల సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img