Monday, August 15, 2022
Monday, August 15, 2022

ప్రభాస్ పై హోప్స్ పెట్టుకున్న ఎయిర్ టెల్ పిల్

ఆమద్య ఎయిర్ టెల్ అంటే ఆ అమ్మాయి పేరు గుర్తుకు వచ్చేంతగా పాపులర్ అయ్యింది. సాదారణంగా ఒక మోడల్ ఒక ఏడాది లేదా రెండేళ్ల పాటు ఒక బ్రాండ్ కు అంబాసిడర్ గా చేస్తారు. కాని సాషా మాత్రం ఎయిర్ టెల్ కు సుదీర్ఘ కాలం పాటు బ్రాండ్ అంబాసిడర్ అవ్వడం వల్ల అందరిలో బాగా నోటెడ్ అయ్యింది. ఒక హీరోయిన్ కు ఎంతగా గుర్తింపు లభిస్తుందో సాషా కు కూడా అంతటి గుర్తింపు దక్కింది. అన్ని భాషల ప్రేక్షకులకు కూడా సాషా ను గుర్తించే రేంజ్ కు వెళ్లింది. అప్పట్లోనే పాన్ ఇండియా స్టార్ అన్నట్లుగా పేరు దక్కించుకుంది. బ్రాండ్ అంబాసిడర్ గా మంచి గుర్తింపును దక్కించుకున్న సాషా సినిమాల్లో కూడా నటించేందుకు సిద్దం అయ్యింది. అయితే ఎయిర్ టెల్ యాడ్ కు వచ్చినంత గుర్తింపు సినిమాల ద్వారా రాలేదు. ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమాలో హీరోయిన్ గా సాషా నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడటంతో సాషా కు మళ్లీ సినిమాల్లో ఆఫర్లు రాలేదు. ఒకటి రెండు వచ్చినా కూడా మరీ చిన్నా చితక సినిమాలు అవ్వడం వల్ల ఆసక్తి చూపించలేదు. కాస్త గ్యాప్ తర్వాత సాషా ఒక భారీ సినిమాతో రాబోతుంది. అది కూడా పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిన ప్రభాస్ సినిమాతో అవ్వడం విశేషం. ప్రభాస్ కు జోడీగా ఈ పొట్టి పిల్ల ఏంట్రా బాబు అనుకుంటున్నారు.. అసలు విషయం ఏంటీ అంటే ఈమె ప్రభాస్ సినిమాలో నటిస్తుంది కాని ఆయనతో రొమాన్స్ ఉండబోవడం లేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన రాధే శ్యామ్ సినిమాలో సాషా కీలక పాత్రలో కనిపించబోతుంది. కథలో చాలా కీలకమైన పాత్ర ఈమెది అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈమె పాత్ర అత్యంత విభిన్నంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా నిరాశ పర్చినా కూడా రాధే శ్యామ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. పాన్ ఇండియా మూవీగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. కనుక ఇప్పటి వరకు ఎయిర్ టెల్ పిల్ల అంటూ అంతా పిలిచిన వారు రాధే శ్యామ్ నటి అంటూ గుర్తించడం ఖాయం. కనుక రాధే శ్యామ్ తర్వాత ఈమె సినిమాల్లో హీరోయిన్ గా బిజీ అవ్వడం ఖాయం అంటూ అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సాషా ఒక మోడల్ గా దేశ వ్యాప్తంగా సుపరిచితురాలు అయినా కూడా హీరోయిన్ గా మాత్రం ఒక మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ఆ బ్రేక్ ఖచ్చితంగా ఈ అమ్మడికి అతి త్వరలోనే రాధే శ్యామ్ సినిమా ద్వారా వస్తుందని.. ప్రభాస్ మూవీ అవ్వడం వల్ల సాషాకు మంచి క్రేజ్ దక్కుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. సాషా కూడా రాధే శ్యామ్ సినిమా స్థాయి తెలుసుకుని ఆ సినిమాలో నటించేందుకు సిద్దం అయ్యింది. ప్రభాస్ వంటి స్టార్ తో ఒక్క సీన్ పడ్డా కూడా మంచి గుర్తింపు దక్కించుకోవడం ఖాయం. అలాంటిది తనకు సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ పడటం వల్ల ఖచ్చితంగ తనకు ఈ సినిమా హీరోయిన్ గా టర్నింగ్ పాయింట్ ను ఇస్తుందనే నమ్మకంను ఆమె వ్యక్తం చేస్తోంది. రాధే శ్యామ్ లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించిన విషయం తెల్సిందే. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈసినిమాలో కీలక పాత్రను కృష్ణం రాజు చేయడంతో సినిమాపై అంచనాలు మరీ ఎక్కువగా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img