Monday, February 6, 2023
Monday, February 6, 2023

‘బంగార్రాజు’లో ఫరియా అబ్దుల్లా..?

హైదరాబాద్‌ : అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొం దుతోన్న కుటుంబ కథా చిత్రం ‘బంగార్రాజు’. సూపర్‌ హిట్‌ చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికిది సీక్వెల్‌ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శర వేగంగా జరుగుతోంది. గురువారం ఈ సినిమా లోని కథానాయిక కృతిశెట్టికి సంబంధించిన పరిచయ ప్రచార చిత్రం వెలువడిరది. నాగలక్ష్మిపాత్రలో గ్లామరస్‌గా రివీలైన ఆమె లుక్‌ వైరల్‌ అవుతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన రూమర్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘బంగార్రాజు’ సినిమాలో ‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా ఓ స్పెషల్‌ నెంబర్‌ చేయబోతోందని తెలుస్తోంది. మొదటి భాగంలో ఫ్యామిలీ రిలేషన్స్‌, ఎమోషన్స్‌ను బాగా పండిరచిన దర్శకుడు.. రెండో భాగంలో వాటితో పాటు గ్లామర్‌ డోస్‌ను కూడా బాగానే పెంచుతున్నారట. అందులో భాగంగానే ఇందులో కృతిశెట్టి గ్లామర్‌ని ఎలివేట్‌ చేయడంతో పాటు .. ఫరియా స్పెషల్‌ సాంగ్‌ని కూడా ప్లాన్‌ చేస్తున్నారట. బేసిగ్గా ఫరియా మంచి డ్యాన్సర్‌. హిప్‌ హాప్‌, బీ బాయ్‌, బెల్లీ డ్యాన్సుల్లో ఆమె అందెవేసిన చెయ్యి. అందుకే అమ్మడిని ఈ అవకాశం వరించిందట. మరి ‘బంగార్రాజు’ చిత్రానికి ‘జాతిరత్నం’ లాంటి ఫరియా డ్యాన్స్‌ ఏ రేంజ్‌ లో హైలైట్‌ అవుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img