Monday, December 5, 2022
Monday, December 5, 2022

బంగార్రాజు మేకర్ నుండి ‘దివి’ కి పిలుపు

తెలుగు బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ దివి ప్రస్తుతం పలు సినిమాలు మరియు వెబ్ సిరీస్ ల్లో నటిస్తుంది. అంతే కాకుండా మ్యూజికల్ వీడియోలను కూడా ఈమె చేస్తూ కెరీర్ లో చాలా బిజీగా ఉంది. బిగ్ బాస్ కు ముందు చిన్నా చితకా ఆఫర్లు మాత్రమే వచ్చేవి. కాని ఇప్పుడు లీడ్ రోల్స్ లో నటిస్తోంది. తెలుగు అమ్మాయిలు హీరోయిన్ లుగా పనికి రారు అనుకునే వారికి ఈమె సరైన సమాధానం అన్నట్లుగా అందాల ప్రదర్శణ నుండి మొదలుకుని నటన వరకు అన్నింట్లో కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటుంది. ఈమెకు మెగాస్టార్ చిరంజీవి వేదాళం రీమేక్ లో కీలక పాత్రకు గాను ఎంపిక అయిన విషయం తెల్సిందే. తాజాగా ఈమె మరో బిగ్ ఆఫర్ ను దక్కించుకుంది. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సోగ్గాడే చిన్ని నాయన చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన బంగార్రాజు సినిమాను నాగార్జునతో చేస్తూనే మరో వైపు నిర్మాతగా కూడా సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అయ్యాడు. లో బడ్జెట్ లో కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీని కళ్యాణ్ కృష్ణ ఓటీటీ కోసం నిర్మించేందుకు స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేయించారట. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ స్నేహితుడు అయిన నవీన్ గాంధీ దర్శకత్వం వహించబోతున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న బంగార్రాజు సినిమా తో పాటు మరో వైపు ఈ సినిమాను కూడా కళ్యాణ్ కృష్ణ సమాంతరంగా నిర్మించబోతున్నాడు. ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీలో లీడ్ రోల్ ను దివి పాపతో చేయించేందుకు కళ్యాణ్ కృష్ణ సిద్దం అయ్యాడని తెలుస్తోంది. ప్రస్తుతం చివరి దశ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ను త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ప్రముఖ ఓటీటీ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఒక మంచి కాన్సెప్ట్ ను తీసుకుని కమర్షియల్ హంగులు అద్ది రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే దివి నటిగా.. అందంతో ఆకట్టుకుంది. కనుక ఈ సినిమాకు ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని దివి ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే సినిమా ను ఓటీటీ ద్వారా విడుదల చేసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img