Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

బాలయ్య వ్యాఖ్యలపై నాగచైతన్య, అఖిల్‌ స్పందన

విశాలాంధ్ర`హైదరాబాద్‌: వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సభలో తోటి నటీనటుల గురించి బాలయ్య మాట్లాడుతూ… వాళ్లతో కలిసి టైమ్‌ పాస్‌ చేశానని, సినిమా కబుర్లు చెప్పుకుంటామని తెలిపాడు. ఈ మాటల సందర్భంలోనే ఆ రంగారావు… ఈ రంగారావు… అక్కినేని-తొక్కినేని అంటూ మాట జారాడు. ఇక ఈ మాటలు అక్కినేని అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. సోషల్‌ మీడియాలో బాలయ్యపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా నందమూరి అభిమానులు, అక్కినేని అభిమానులు మధ్య ట్విట్టర్‌లో మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని నాగచైతన్య, అఖిల్‌ స్పందించారు. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వర రావు గారు, ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు, వారిని అగౌరవపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం అంటూ ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్‌ ఇప్పుడు సినిమా సర్కిల్‌ లో తీవ్ర చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img