Thursday, February 9, 2023
Thursday, February 9, 2023

‘బిచ్చగాడు`2’లో హీరో, సంగీత దర్శకుడు ఒక్కరే !

హైదరాబాద్‌ : తమిళంలోనే కాదు తెలుగులోను విజయ్‌ ఆంటోనికి అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. కథాకథనాల్లోను .. పాత్రల విషయంలోను ఆయన చూపించే వైవిధ్యమే అందుకు కారణం. విజయ్‌ ఆంటోని సంగీత దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే పట్టుదలతో ఆ దిశగా అడుగులు వేశాడు.
ఈ నేపథ్యంలో ఆయన నటించిన ‘బిచ్చగాడు’ సినిమా తమిళంతో పాటు తెలుగులోను భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఆయన హీరోగానే వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ఈ క్రమంలో ‘బిచ్చగాడు’ స్థాయిలో ఏ సినిమా హిట్‌ కాకున్నా తన ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. ఆయన తాజా చిత్రంగా ‘బిచ్చగాడు 2’ రూపొందుతోంది. ఈ సినిమాను ఆయన నిర్మించడమే కాకుండా, సంగీతాన్ని అందించాలని నిర్ణయించుకున్నాడట. ‘బిచ్చగాడు’ స్థాయిలో ఈ సినిమా విజయవంతం కావాలనే ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు. మొదటిభాగాన్ని శశి తెరకెక్కించగా, ఈ సినిమాకి ప్రియా కృష్ణస్వామి దర్శకత్వం వహిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img