Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

బైక్‌పై షూటింగ్‌కు అమితాబ్‌

ముంబై: వెళ్లే దారిలో సెలబ్రిటీలు కనిపిస్తేనే అభిమానుల ఆనందానికి హద్దులుండవు. అలాంటిది అనుకోకుండా ఓ పెద్ద సెలబ్రిటీ మన బైక్‌పై ప్రయాణిస్తే ఆ సంతోషం ఎలా ఉంటుందో ఊహించుకోండి. అది కూడా అమితాబ్‌ బచ్చన్‌ లాంటి అగ్ర హీరో అయితే ఆ అనుభూతి చెప్పడానికి మాటలు చాలవు. ముంబైలో బిగ్‌ బీ చేసిన ఈ పనికి ప్రస్తుతం ఓ వ్యక్తి తెగ సంబరపడిపోతున్నాడు. నిరాడంబరంగా ఉండే సినీ తారల్లో అమితాబ్‌ ముందు వరుసలో ఉంటారు. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆయన చాలా సింపుల్‌గా ఉంటూ అందరి దృష్టినీ ఆకర్షించారు. తాజాగా మరోసారి ఓ సామాన్యుడి బైక్‌పై షూటింగ్‌ స్థలానికి వెళ్తూ ముబై వీధుల్లో కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. తనకు లిఫ్ట్‌ ఇచ్చిన వ్యక్తికి థ్యాంక్స్‌ చెబుతూ బిగ్‌బీ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘నువ్వు ఎవరో నాకు తెలీదు.. కానీ సమయానికి నన్ను షూటింగ్‌ జరిగే ప్రదేశానికి తీసుకెళ్లావు. ట్రాఫిక్‌లో చిక్కుకుపోకుండా సాయం చేశావు’’ అంటూ అతడికి ధన్యవాదాలు చెప్పారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘అతడెవరో చాలా లక్కీ’ అని ఓ యూజర్‌ కామెంట్‌ చేయగా.. ‘మీరు నిజంగానే మెగాస్టార్‌’ అని మరొకరు అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img