Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

బేబీ ఓ బేబీ.. నుంచి మరో పాట.. ఎప్పుడంటే..

ఈ ఏడాది వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన నితిన్ ఃచెక్ః సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకొని ఆ వెంటనే ఃరంగ్ దేః మూవీతో డీసెంట్ హిట్ అందుకొన్నాడు. ఇక ఇప్పుడు ఃమ్యాస్ట్రోః అంటూ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హిందీలో అయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన సూపర్‌‌హిట్ సినిమా ాఅంధధూన్్ణ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. కొద్ది రోజుల క్రితం మార్చి 30న నితిన్ పుట్టినరోజు సందర్భంగా అతనికి విషెస్ చెబుతూ.. చిత్ర యూనిట్ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో చేతిలో స్టిక్ పట్టుకొని నడుస్తున్న నితిన్ వెనకాలే రక్తపు మరకలు కనిపిస్తుండటంతో చిత్రంలో అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతుందని అర్థమవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ని వదిలించి చిత్ర యూనిట్.. ాబేబీ ఓ బేబీ్ణ అనే పాట ప్రోమోని రిలీజ్ చేశారు. ాబేబీ ఓ బేబీ.. చిన్న నవ్వు చాలే్ణ అంటూ సాగే పాటను జూలై 16న ఉదయం 10.08కి విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ఈ పాటకి శ్రీజో లిరిక్స్ రాయగా, అనురాగ్ కులకర్ణి పాడారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా నబా నటేష్.. మరో కీలక పాత్రలో హీరోయిన్ తమన్నా భాటియా నటిస్తున్నారు. ఎన్.సుధాకర్ రెడ్డి మరియు నిఖితా రెడ్డిలు చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img