Friday, August 19, 2022
Friday, August 19, 2022

భారీ హైప్‌ పెంచేసిన ‘నారప్ప’ ట్రైలర్‌


శ్రీకాంత్‌ అడ్డాల డైరెక్షన్‌ లో వస్తోన్న నారప్ప ట్రైలర్‌ ను మేకర్స్‌ విడుదల చేశారు. టాలీవుడ్‌ యాక్టర్‌ విక్టరీ వెంకటేశ్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో సీనియర్‌ బ్యూటీ ప్రియమణి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన అన్ని అప్‌డేట్స్‌ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్‌ తెచ్చుకున్నాయి. తాజాగా చిత్ర యూనిట్‌ ‘నారప్ప’ ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుంచింది. ఇందులో చూపించిన సన్నివేశాలు సినిమాపై హైప్‌ పెంచేశాయి.వెంకటేశ్‌ పెద్ద వయస్కుడిగా, యువకుడిగా రెండు పాత్రల్లో కన్పిస్తారని అర్థమవుతోంది. ఈ చిత్రంలో రావు రమేష్‌, రాజీవ్‌ కనకాల కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ బాణీలు కట్టారు. వెంకటేష్‌ కెరీర్‌లో 74వ సినిమాగా ఈ మూవీ రిలీజ్‌ కాబోతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img