Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

మళ్లీ సినిమాలకు బ్రేక్‌..?

హైదరాబాద్‌ : పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఈ ఏప్రిల్‌లో విడుదలైన ‘వకీల్‌ సాబ్‌’తో టాలీవుడ్‌లోకి కమ్‌ బ్యాక్‌ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సూపర్‌ సక్సెస్‌తో, ఆయనిచ్చిన మూడేళ్ల గ్యాప్‌ను అభిమానులు మరిచి పోయేలా చేశారు. ప్రస్తుతం పవర్‌ స్టార్‌ డైరీ వరుస సినిమాలతో నిండిపోయింది. ‘భీమ్లానాయక్‌, హరిహర వీరమల్లు’ చిత్రాలు ప్రస్తుతం సెట్స్‌ మీదుండగా.. త్వరలో హరీశ్‌ శంకర్‌ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది. ఆపై సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో మూవీ కూడా సెట్స్‌ మీదకు వెళుతుంది. ఇంకా పలువురు స్టార్‌ డైరెక్టర్స్‌ పవన్‌తో కమిట్‌మెంట్‌ తీసుకున్నారు. అలాగే.. మరికొందరు దర్శకులు ఆయనతో సినిమాలు తీయడానికి క్యూలో ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. పవన్‌ ఈ నాలుగు సినిమాలు పూర్తి చేశాకా సినిమాలకు మళ్లీ బ్రేక్‌ ఇవ్వనున్నారన్న వార్త బలంగా వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే.. ఇది అభిమానులకు నిజంగా చేదువార్తే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img