Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

మహేశ్‌బాబుతో ఎన్టీఆర్‌ గేమ్‌!

హైదరాబాద్‌ : సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఒకే వేదికపై సందడి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ స్పెషల్‌ ఎపిసోడ్‌కు ప్రముఖ ఛానల్‌ భారీగా ప్లాన్‌ చేసినట్లు సమాచారం. తారక్‌ ‘హోస్ట్‌గా వ్యవహ రిస్తున్న గేమ్‌ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రారంభ ఎపిసోడ్‌లో రామ్‌చరణ్‌ సందడి చేయగా, దసరా పండుగ రోజు ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో మహేశ్‌బాబు స్పెషల్‌గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ షోలో పాల్గొనేందుకు, గేమ్‌ ఆడేందుకు మహేశ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని, త్వరలోనే ఈ ఎపిసోడ్‌ షూట్‌ జరగనుందని సమాచారం. ఈ వార్తలపై ఇప్పటికే నెటిజన్లు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా సోమవారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో రాజమౌళి, కొరటాల శివ తమ ఆటతో మెప్పించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img