Monday, September 26, 2022
Monday, September 26, 2022

మా’కు ప్రకాశ్‌రాజ్‌ రాజీనామా

తొందరపడొద్దు : మంచు విష్ణు

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలో అధ్యక్షుడిగా ఓటమి అనంతరం ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు. ఇది బాధతో చేస్తున్న రాజీనామా కాదని, ‘అతిథిగా వచ్చాను.. అతిథిగా ఉండాలి’ అనే ఉద్దేశంతో చేస్తున్నానని అన్నారు. ఈ మేరకు ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణుకు సందేశం పంపారు. దీనిపై మంచు విష్ణు సమాధానం ఇచ్చి, ఆ స్క్రీన్‌షాట్‌ను అభిమానులతో పంచుకున్నారు. ‘‘డియర్‌ విష్ణు, ‘మా’ ఎన్నికల్లో నీవు సాధించిన అద్భుత విజయానికి అభినందనలు. ‘మా’ను నడిపించేందుకు అవసరమైన శక్తినంత పొందాలని కోరుకుంటున్నా. ఆల్‌ ది బెస్ట్‌. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. దయచేసి నా నిర్ణయాన్ని ఆమోదించండి. నాన్‌-మెంబర్‌గా నీకు అన్ని విధాలా సాయం చేస్తా.. థ్యాంక్యూ ప్రకాశ్‌రాజ్‌’’ అని ఆ మెస్సేజ్‌లో ప్రకాశ్‌రాజ్‌ పేర్కొన్నారు. అందుకు మంచు విష్ణు సమాధానం ఇస్తూ మీరు తీసుకున్న నిర్ణయంపై నేను సంతోషంగా లేను. మీరు నాకంటే పెద్ద వారు. జీవితంలో గెలుపోటములనేవి ఒకే నాణేనికి రెండు వైపులా ఉంటాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. మీరు భావోద్వేగానికి లోనుకావొద్దు. మా కుటుంబలో మీరూ భాగమే. కలిసి పనిచేయడానికి మీ ఆలోచనలకు మాకు అవసరం. మీరు ఇప్పుడు నాకు సమాధానం ఇవ్వొద్దు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా. అన్ని విషయాలపై చర్చించుకుందాం. లవ్‌ యు అంకుల్‌. దయచేసి తొందరపడొద్దు’’ అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img